బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ ప్లాన్ అదే..!

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ ప్లాన్ అదే..!

Published on Nov 30, 2019 1:27 PM IST

rrr 2

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయ్యేదెప్పుడూ… అంటే సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. నేషనల్ వైడ్ గా మార్కెట్ ఉన్న హిందీ చిత్రాలు సైతం బాహుబలి రికార్డ్స్ దరిదాపుల్లోకి రాలేకపోతున్నాయి. ఐతే రాజమౌళి రికార్డ్ రాజమౌళే బద్దలు కొట్టడం ఆయనకున్న అలవాటు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆయన బాహుబలి రికార్డ్స్ కి చెక్ పెట్టడం ఖాయం అని కొందరివాదన. దీనికొరకు రాజమౌళి దగ్గర ప్రత్యేక ప్రణాళికలు కూడా ఉన్నాయట.

ముఖ్యంగా బాహుబలికి మించి అధిక భాషలలో ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ మరియు మలయాళ భాషలలో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని కన్నడలో విడుదల చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ ని కన్నడ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఇక దేశంలోని ఈ ఐదు ప్రధాన భాషలతో పాటు, ప్రాధాన్యం ఉన్న రెండు మూడు భాషలో అలాగే జపాన్, చైనా ఇలా మొత్తం పది భాషలకు తగ్గ కుండా భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారట. రాజమౌళి చిత్రం కావడం వలన బ్రాండ్ వాల్యూతో వచ్చే ఓపెనింగ్స్ , భారీ కలెక్షన్స్ తో తన రికార్డ్స్ తానే బద్దలు కొట్టాలని రాజమౌళి ప్రణాళిక అని సమాచారం. డెబ్భై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్, అల్లూరిగా నటిస్తున్నారు.

తాజా వార్తలు