అడివి శేష్ చేతులమీదుగా ‘క్షీరసాగరమథనం’ ఫస్ట్ లుక్ లాంచ్

అడివి శేష్ చేతులమీదుగా ‘క్షీరసాగరమథనం’ ఫస్ట్ లుక్ లాంచ్

Published on Nov 30, 2019 3:57 PM IST

ksheerasagara madhanam

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ మరియు మానస్ నాగులపల్లి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘క్షీరసాగర మథనం’. నూతన నటి అక్షిత సొనవనే హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తుండగా మరో నటుడు ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నారు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనిల్ పంగులూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. క్షీరసాగర మథనం అనే అచ్చ తెలుగు టైటిల్ కి మంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ చెప్పారు.

కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని యంగ్ హీరో అడివి శేషు విడుదల చేశారు. అలాగే చిత్ర యూనిట్ ని అభినందించడంతో పాటు, సినిమా విజయం సాధించాలని విశెష్ చెప్పారు. తమ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు చిత్ర దర్శకనిర్మాతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అజయ్ అరసడ సంగీతం అందిస్తుండగా చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, గౌతమ్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు