బన్నీ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరింది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. క్రేజీ కాంబినేషన్ కి తోడు, థమన్ అందించిన సూపర్ హిట్ సాంగ్స్ జతకావడం సినిమాకు మంచి హైప్ తెచ్చిపెట్టింది. కాగా ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న నివేదా పేతురాజ్ లుక్ ని నేడు విడుదల చేశారు. నివేద పుట్టిన రోజు సంధర్భంగా సినిమాలోని ఆమె పాత్ర లుక్ ని విడుదల చేయడం జరిగింది. మోడరన్ లుక్ లో ఆమె ట్రెండీగా కనిపిస్తున్నారు.
అలవైకుంఠపురంలో చిత్రంలో హీరో సుశాంత్ ఓ కీలక రోల్ చేస్తున్న తరుణంలో ఆయనకు జోడిగా ఈమె పాత్ర ఉండే అవకాశం కలదు. ఐతే నివేదా పాత్రపై ఎటువంటి స్పష్టత లేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే కీలక రోల్ చేస్తున్నారు. 2020జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.


