బన్నీ ని వెండి తెరపై చూసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ఆయన నటించిన ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఆయన చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బన్నీ కూడా ఫ్యాన్స్ నిరీక్షణకు సమాధానంగా సూపర్ హిట్ కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు. బన్నీ త్రివిక్రమ్ ల మూవీ అంటే మినిమమ్ గ్యారంటీ హిట్ గా ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు నిరూపించాయి. ఇక హ్యాట్రిక్ మూవీ కొరకు త్రివిక్రమ్ కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని కోణాలు కలిగిన ఫుల్ ప్యాక్డ్ స్టోరీ సిద్ధం చేశారట.
ఐతే లేటెస్ట్ సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో మనసుకు హత్తుకునేలా ఉంటాయట. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో బన్నీ, మురళి శర్మ, టబు లమధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో బన్నీ యాక్టింగ్ ఏడిపించేస్తుందని సమాచారం. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ ని బన్నీ నటన గుర్తు చేస్తుందట. బన్నీ తన సంక్రాంతి మూవీతో గట్టిగా కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.


