యంగ్ సెన్సేషన్ థమన్ నుండి వచ్చిన ఆల్బమ్స్ లో ‘సామజవరగమనా’ సాంగ్ బెస్ట్ వన్ గా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. మ్యూజిక్ లవర్స్ నుండి దానికి వస్తున్న స్పందన, యూ ట్యూబ్ లో దక్కుతున్న రికార్డు వ్యూస్ అందుకు నిదర్శనం. సెప్టెంబర్ చివర్లో అనగా రెండు నెలల క్రితం ‘సామజవరగమనా’ సాంగ్ విడుదల చేయగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. వేగంగా 100మిలియన్ వ్యూస్ దక్కించుకున్న మొదటి తెలుగు సాంగ్ ‘సామజవరగమనా’ కావడం విశేషం. లైక్స్ విషయంలో కువద్దా మిలియన్ కు పైగా దక్కించుకోవడం గమనార్హం.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురంలో చిత్రం కోసం థమన్ ఈ పాట స్వరపరిచిన విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, నివేదా పేతు రాజ్, సుశాంత్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.


