అభిమానులతో కలిసి చిరంజీవి చేసిన సేవకు విశిష్ట గౌరవం

అభిమానులతో కలిసి చిరంజీవి చేసిన సేవకు విశిష్ట గౌరవం

Published on Dec 1, 2019 5:33 PM IST

chiranjeevi

తనను మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో చిరంజీవి 1998 అక్టోబర్లో మొదలుపెట్టిన మహత్తర కార్యం రక్తదానం, నేత్రదానం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది అభిమానులు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్ర దానం చేశారు.. చేస్తూనే ఉన్నారు.

ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా వేలమంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారు. ఈ ట్రస్ట్ ద్వారానే ప్రజల్లో రక్తదానం మీదున్న అపోహలన్నీ తొలగి దాతల సంఖ్య విశేషంగా పెరిగింది. అందుకే ఈ బ్లడ్ బ్యాంకుకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా డిల్లీలోని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డుకు ఎంపిక చేశాయి.

ఈరోజు సాయంత్రం రవీంద్రభారతిలో బ్లడ్ బ్యాంకుకు ఈ అవార్డును అందించనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ 20 ఏళ్ల పాటు తమతో కలిసి చిరంజీవి చేసిన విశేష కృషికి, సేవకు సరైన గౌరవం, గుర్తింపు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు