రజనీ సినిమాలో కథానాయిక ఈమేనట

రజనీ సినిమాలో కథానాయిక ఈమేనట

Published on Dec 4, 2019 8:28 PM IST

Rajini

శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన తర్వాతి సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. మొదలవడానికి మునుపే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మామూలుగా శివ సినిమా అంటే అందులో హీరో హీరోయిన్ల జోడీ చాలా హుందాగా, చూడ చక్కగా ఉంటుంది. అందుకే ఆయన రజనీ సినిమాలో సైతం నటించే కథానాయిక ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

ముందుగా మంజూ వారియర్ రజనీకి జోడీగా చేస్తుందని వార్తలు వినబడగా, ఈమధ్య ఖుష్బూ పేరు ప్రముఖంగా వినబడింది. కానీ ఇప్పుడు మాత్రం రజనీ సరసన సీనియర్ నటి మీనా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఖచ్చితమైనదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇకపోతే మురుగదాస్ డైరెక్షన్లో రజనీ చేసిన ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదలకానుంది.

తాజా వార్తలు