మెగాస్టార్, సూపర్ స్టార్ ఒకే వేదికపై..!

మెగాస్టార్, సూపర్ స్టార్ ఒకే వేదికపై..!

Published on Dec 20, 2019 5:10 PM IST

Mahesh Chiru

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ని నిన్నటి నుండి సరిలేరు నీకెవ్వరు మేకర్స్ సస్పెన్సు లో పెట్టారు. నేడు ఓ మైల్ స్టోన్ అనౌన్స్మెంట్ రానుందని వారు ప్రకటించినప్పటి నుండి.. ఆ బిగ్ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఆతృతకు తెరదించుతూ సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

అదేమిటంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ అతిధిగా రానున్నారు. వచ్చే నెల 5న ఎల్ బి స్టేడియం లో సాయంత్రం జరగనున్న ఈ మెగా ఈవెంట్ కి చిరు ముఖ్య అతిధిగా రానున్నట్లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ ఒకే వేదికపై కనిపించింది చాలా అరుదు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఈ అరుదైన సంఘటన ఆవిష్కృతం కానుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ సరసన రష్మిక మందాన నటించగా వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తాజా వార్తలు