బన్నీ ప్రొడ్యూసర్స్ ని ఇరుకున పెట్టిన మెగాస్టార్

బన్నీ ప్రొడ్యూసర్స్ ని ఇరుకున పెట్టిన మెగాస్టార్

Published on Dec 21, 2019 10:07 AM IST

chiru2

ముందుగా ఊహించినట్టే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించేశారు. నిన్న దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర చిరంజీవి నివాసానికి స్వయంగా వెళ్లి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఇండస్ట్రీలో మెగా పవర్ గా పేరున్న చిరంజీవి సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఈ మూవీకి చాలా కలిసొచ్చే అంశం. ఖచ్చితంగా సరిలేరు నీకెవ్వరు ఓపెనింగ్స్ మరింత పెరగడానికి దోహదం చేయడం ఖాయం.

కాగా సరిలేరు నీకెవ్వరు మూవీకి ఒకరోజు వ్యవధిలో విడుదల అవుతూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న అల వైకుంఠపురంలో చిత్ర నిర్మాతలను ఈ విషయం ఇరుకున పడేసిందని సమాచారం. మెగా రాకతో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మరింత హైప్ క్రియేట్ కావడం ఖాయం. ఈ పరిస్థితులలో తమ ఈవెంట్ కి ఎవరిని అతిధిగా పిలవాలని వారు సందిగ్ధంలో పడ్డారట. ఒకటి రెండు రోజులలో బన్నీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అనౌన్స్మెంట్ చేయనున్న తరుణంలో ఎవరిని అతిధిగా పిలవాలని అల వైకుంఠపురంలో నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఐతే వారు కూడా మెగాస్టార్ నే ఈవెంట్ కి పిలిచే అవకాశం కలదు. లేదా రామ్ చరణ్ లేదా తారక్ రావచ్చు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి వస్తాడు అనేది అనుమానమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు