మహేష్ సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో మిల్కీ తమన్నా ఓ ఐటెం సాంగ్ చేయనుందన్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్స్ చేయడంలో స్పెషలిస్ట్ అయినటువంటి దేవిశ్రీ స్వరపరిచిన మైండ్ బ్లాక్ సాంగ్ లో తమన్నా తన అందం మరియు హాట్ స్టెప్స్ తో కిక్కు ఎక్కించనుంది. నేడు తమన్నా బర్త్ డే పురస్కరించుకొని ఈ సాంగ్ లోని ఆమె లుక్ ని సరిలేరు నీకెవ్వరు టీమ్ విడుదల చేశారు. ఆర్మీ ప్యాంటు ధరించి ఉన్న తమన్నా చాలా హాట్ గా ఉంది. మిలిటరీ క్యాంపు లో సైనికుల మధ్య వచ్చే ఓ ప్రత్యేక సాంగ్ ఇదని తెలుస్తుంది.
గతంలో ఎన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్, యష్ వంటి హీరోల సినిమాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది. సరిలేరు నీకెవ్వరు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వచ్చే నెల 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.


