ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో దుమ్మురేపిన రంగస్థలం

ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో దుమ్మురేపిన రంగస్థలం

Published on Dec 22, 2019 9:05 AM IST

rangasthalam6

గత ఏడాది స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 120కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసింది. 80ల కాలంనాటి ఒక పల్లెటూరి రివేంజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. కాగా నిన్న చెన్నై వేదికగా జరిగిన సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2019 లో ఈ చిత్రం సత్తా చాటింది. రంగస్థలం ఏకంగా ఐదు విభాగాలలో అవార్డ్స్ గెలుచుకుంది.

బెస్ట్ యాక్టర్ గా రామ్ చరణ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో దేవిశ్రీ, బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనసూయ భరద్వాజ్, బెస్ట్ లిరిసిస్ట్ చంద్ర బోస్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రత్న వేలు రంగస్థలం చిత్రం నుండి అవార్డ్స్ అందుకున్నారు. దీనితో చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు సుకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డ్స్ గెలుచుకున్న వీరందరూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు