రైల్వే టికెట్స్ అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్

రైల్వే టికెట్స్ అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్

Published on Dec 23, 2019 7:08 PM IST

kangana

బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ కంగనా రనౌత్ మారిపోయారు. ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది మణికర్ణిక అనే భారీ పీరియాడిక్ మూవీలో నటించారామె. ఇక తమిళ నటి, రాజకీయవేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో ఆమె జయలలిత పాత్ర చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా కొనసాగుతుండగా జయలలితగా కంగనా లుక్ కూడా విడుదల చేశారు. ఈ మూవీకోసం డాన్స్ లు గుర్రపు స్వారీలు వంటివి కూడా ఆమె నేర్చుకోవడం జరిగింది.

కాగా కంగనా నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ పంగా. ఈ చిత్రంలో కంగనా రైల్వే ఉద్యోగి అయిన మధ్యతరగతి యువతి పాత్ర చేస్తుంది. నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదల నేపథ్యంలో కంగనా వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ నందు సాధారణ ఉద్యోగిలా టికెట్స్ అమ్మారు. స్వయంగా టికెట్ కౌంటర్ లో కూర్చోని టికెట్స్ అమ్ముతున్న కంగనాను చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారట. ఇక అశ్విన్ ఐయ్యర్ త్రివేది దర్శకత్వం వహిస్తుండగా ఫాక్స్ స్టూడియోస్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 24న పంగా విడుదల కానుంది.

తాజా వార్తలు