టాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ చరణ్ ఉపాసనలు చాలా ప్రత్యేకం. సోషల్ మీడియా వేదికగా వీరు ఫ్యాన్స్ కి ఫిట్నెస్ మరియు హెల్త్ విషయంలో అనేక సూచనలు ఇస్తారు.అలాగే ఇద్దరూ మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా. కాగా ఈ యంగ్ కపుల్ కొద్దినెలల క్రితం ఒక సాహస యాత్ర చేశారు. ఆఫ్రికా వెళ్లిన ఈ జంట అక్కడ వైల్డ్ లైఫ్ సఫారీలో పాల్గొన్నారు. అంతే కాకుండా అక్కడి వారి సహస యాత్రకు సంబంధించిన ఫొటోలతో పాటు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు. వీరిద్దరూ వీరి కెమెరాలో బంధించిన జీవ వైవిధ్యాన్ని టాలీవుడ్ ప్రముఖులకు ప్రదర్శన ఇచ్చారు. మహేష్ దంపతులు, సమంత, మంచు లక్ష్మీ వంటి వారు ఈ ఫోటో గేలరీ ప్రదర్శనకు హాజరుకావంతో పాటు, వీరి సహస యాత్రను మరియు వారి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని అభినందించారట. దీనితో రామ్ చరణ్ ఉపాసన సంతోషంతో ఉబ్బితబ్బిబై పోతున్నారట.
ఇక రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బ్రేక్ లో ఉన్నారు. ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుత షెడ్యూల్ నందు లేకపోవడంతో ఆయన విరామం తీసుకున్నారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్ర చేస్తున్నారు.


