మణిరత్నం హీరోలంతా బాగా కష్టపడుతున్నారట

మణిరత్నం హీరోలంతా బాగా కష్టపడుతున్నారట

Published on Dec 25, 2019 1:30 AM IST

Mani Ratnam

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా షూట్ ఇటీవలే థాయిలాండ్ లో మొదలైంది. అక్కడి డీప్ ఫారెస్ట్ ఏరియాలు, సముద్రపు తీరాల్లో షూట్ చేస్తున్నారు టీమ్. ఈ లొకేషన్స్ చాలా అందమైనవే అయినా అక్కడ చిత్రీకరణ జరపడం కష్టంతో కూడుకున్న వ్యవహారమట.

ప్రతిరోజూ లొకేషన్లకు సమయానికి చేరుకోవడానికి విక్రమ్, జయం రవి, కార్తిలతో పాటు ఇతర ముఖ్య నటీనటులంతా తెల్లవారుఝామున మూడు గంటలకే లేచి రెడీ అవుతున్నారట. మొత్తానికి సినిమా కోసం మణిరత్నం అండ్ టీమ్ బాగానే కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, కార్తిలతో పాటు ఐశ్వర్యరాయ్, త్రిష, విజయ్ సేతుపతి, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు.

తాజా వార్తలు