మూవీ మెషిన్ అక్షయ్ కుమార్ సినిమాలు చేసినట్టు దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో కూడా ఏ స్టార్ హీరో ఉండరేమో. ప్రతి ఏడాది మూడు నుండి నాలుగు చిత్రాలు విడుదల చేసే ఎనర్జిటిక్ హీరో ఆయన. ఇక 2019 అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి 8 చిత్రాలలో మూడు సినిమాలు ఆయనవే ఉండటం విశేషం. ఆయన నటించిన హౌస్ ఫుల్ 4, 211 కోట్ల వసూళ్లతో ఐదవ స్థానంలో నిలువగా 203 కోట్లతో మిషన్ మంగళ్, 154 కోట్లతో కేసరి చిత్రాలు ఆరు,ఏడు స్థానాల్లో నిలిచాయి.
ఈ లిస్ట్ లో వార్ మూవీ 318 కోట్ల వసూళ్ళతో అగ్రస్థానం చేజిక్కించుకోగా కబీర్ సింగ్ 278కోట్లు, ఉరి 245కోట్లతో రెండు మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి. ఇక సల్మాన్ నటించిన భారత్ మూవీ 211కోట్ల వసూళ్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ న్యూస్ నేడు విడుదల కానుంది. కరీనా కపూర్, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ మెహతా కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.


