దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్.

Published on Dec 29, 2019 8:02 PM IST

amithab

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డు అందుకున్నారు. దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఈ అవార్డ్ చే గౌరవించబడ్డారు. 1942లో పుట్టిన అమితాబ్ 77 ఏళ్ల ప్రాయంలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో అమితాబ్ అనేకమైన గొప్ప చిత్రాలలో నటించారు.

2020 లో ఆయన నటించిన దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగులో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న అనే కీలక పాత్ర చేసి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవికి అమితాబ్ కి ప్రత్యేక అనుబంధం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు