నయనతారకు చెక్ పెట్టే పనిలో తమిళ నిర్మాతలు

నయనతారకు చెక్ పెట్టే పనిలో తమిళ నిర్మాతలు

Published on Feb 23, 2020 9:45 PM IST

Nayantara

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తుంది. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ రీత్యా నయనతారకు వరుస అవకాశాలు అందుతున్నాయి. హీరోయిన్ గా భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నయనతార మిగతా ఖర్చుల విషయంలో కూడా చుక్కలు చూపిస్తుందట. ఇప్పుడు తమిళ నాట ఫిలిం మేకర్స్ లో ఈ విషయం పెద్ద చర్చిగా మారింది.

నయనతార ఖర్చులతో పాటు, అరడజనుకు పైగా ఉండే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలు భరించాల్సివస్తుందట. దీని కారణంగా నయనతార సిబ్బంది కోసమే రోజుకు ఓ లక్ష రూపాయల వరకు నిర్మాతలకు ఖర్చు అవుతుందట. హోటల్స్, ఫుడ్, ట్రావెల్ ఇలా ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయట. దీనితో నయనతార కు నిర్మాతలు చెక్ పెట్టే పనిలో ఉన్నారట. అగ్రిమెంట్ సమయంలోనే కేవలం అవసరమైన సిబ్బందికి మినహా మిగతా వారికి ఖర్చులు చెల్లించబోమని చెప్పాలని నిర్ణయించుకున్నారట. లేని పక్షములో ఆమెకు అవకాశాలు ఇవ్వకూడని నిర్ణయించుకున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు