ఓటీటీలోకి వచ్చేసిన ‘హృదయం మురళీ’.. థమన్ నటించిన సినిమా ఎందులో అంటే!

ఓటీటీలోకి వచ్చేసిన ‘హృదయం మురళీ’.. థమన్ నటించిన సినిమా ఎందులో అంటే!

Published on Aug 7, 2026 8:00 AM IST

కోలీవుడ్ నుంచి వచ్చిన రీసెంట్ క్లీన్ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో అథర్వ నటించిన రోమ్ కామ్ చిత్రం ఇదయం మురళీ కూడా ఒకటి. తెలుగులో హృదయం మురళీ పేరిట విడుదల చేసిన ఈ సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇదే చిత్రంలో బాయ్స్ సినిమా తర్వాత మళ్ళీ అనేక సంవత్సరాలు తర్వాత సంగీత దర్శకుడు థమన్ నటుడుగా కనిపించాడు.

సో ఈ స్పెషల్ సినిమా ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఇందులో సినిమా అందుబాటులోకి వచ్చింది. సో అప్పుడు చూడాలి అనుకొని మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహించగా ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు