నష్టాన్ని భర్తీ చేసే ఆలోచనలో పవన్

నష్టాన్ని భర్తీ చేసే ఆలోచనలో పవన్

Published on Feb 26, 2020 12:16 PM IST

pawan 3

తమతో సినిమా చేసి భారీగా నష్టపోయిన నిర్మాతలకు తర్వాత ఏదో ఒక దశలో సినిమా ఇవ్వడం మన స్టార్ హీరోలకు అలవాటే. పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో కొద్దిగా ముందే ఉంటారు. పవన్ ఆఖరి చిత్రం ‘అఙ్ఞాతవాసి’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ హాసిని క్రియేషన్స్ భారీ మొత్తంలోనే నష్టాల్ని చవిచూసింది. కానీ ఆ సమయంలో పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో హారికా అండ్ హాసిని సంస్థకు మరో సినిమా చేయలేకపోయారు.

కానీ రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు చిత్రాలకు ఒకే చెప్పిన పవన్ హారికా అండ్ హాసిని నిర్మాతలకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ప్రస్తుతం వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేయాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. అంటే 2021లోనే వారితో పవన్ చిత్రం ఉంటుంది. త్వరలోనే వీరి చిత్రానికి దర్శకుడు ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు