ఎన్టీఆర్ కోసం కూడా ఆయనేనట..?

ఎన్టీఆర్ కోసం కూడా ఆయనేనట..?

Published on Mar 20, 2020 11:52 AM IST

NTR 2

డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30 మూవీ పనులలో తలమునకలై ఉన్నారు. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారట. కాగా అల వైకుంఠపురంలో చిత్రం కొరకు థమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన తరుణంలో ఎన్టీఆర్ కొరకు కూడా ఆయన థమన్ నే తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా పూర్తి న్యాయం చేయగలడని త్రివిక్రమ్ నమ్ముతున్నారట. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత కోసం థమన్ పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలో థమన్ ఎన్టీఆర్ బృందావనం మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కొరకు పొలిటికల్ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నారు అని కొందరు అంటుంటే, మరికొందరు ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మే నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు