ప్రియమణి ఆ క్రికెటర్ ని కొట్టలేదట..కానీ?

ప్రియమణి ఆ క్రికెటర్ ని కొట్టలేదట..కానీ?

Published on Apr 9, 2020 10:37 AM IST

priyamani

టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ఓ క్రికెటర్ ని చెంపదెబ్బ కొట్టినట్లు అప్పట్లో మాధ్యమాలలో ప్రముఖంగా వినిపించింది. ఆమెతో ఆ క్రికెటర్ అసభ్య ప్రవర్తన చేయడంతో అతడి చెంప చెళ్ళుమనిపించిందని కథనాలు ప్రచురించడం జరిగింది. ఐతే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు ప్రియమణి. అప్పుడు నిజంగా ఏమి జరిగిందో చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ప్రియమణి మొబైల్ దొంగిలించి ఆమెను అట పట్టించడం మొదలుపెట్టాడట. అతను ప్రాంక్ కాల్స్ చేస్తూ ప్రియమణికి బాగా కోపం తెప్పించారట.

ఆ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఓ రోజు తాను ఉన్న హోటల్ కి వచ్చి ప్రాంక్స్ చేస్తుంది తానే అని చెప్పాడట. అప్పటికే కోపంతో ఉన్న ప్రియమణి ఇలా చేయం సభ్యత కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. అంతే కానీ అతనిపై చేయి చేసుకోలేదు అని చెప్పింది. సదరు వ్యక్తి ఎవరు? అసలు అతను క్రికెటరా కదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇక ప్రియమణి తెలుగులో విరాటపర్వం మరియు నారప్ప సినిమాలలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు