నానమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న చరణ్..!

నానమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న చరణ్..!

Published on May 1, 2020 12:13 PM IST

Ram Charan

లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడడంతో హీరో రామ్ చరణ్ ఇంటిలో కుటుంబంతో గడుపుతున్నారు. ఆయన తన నాన్నమ్మ గారైన అంజనాదేవి దగ్గర బటర్ తయారు చేసే విధానం నేర్చుకుంటున్నారు. బటర్ మిల్క్ నుండి బటర్ ఎలా తీయాలో నానమ్మ దగ్గర నేర్చుకుంటున్న వీడియోని రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన క్వారంటైన్ టైం ఎలా గడుపుతున్నారో తెలియజేశారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో చరణ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత చరణ్ కావడం విశేషం.

తాజా వార్తలు