బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!

Published on Sep 10, 2026 11:00 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న దాదా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య తన కెరీర్ 112వ చిత్రాన్ని స్టార్ దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాని కూడా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ కాంబినేషన్ పై లేటెస్ట్ న్యూస్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ అక్టోబర్ మొదటి వారం నుంచే సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా బాలయ్య నుంచి సుమారు ఎలా లేదన్నా మూడున్నర నెలల పాటు కాల్షీట్స్ అవసరం అవుతాయని తెలుస్తుంది. సో బాలయ్య స్క్రీన్ టైం ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక స్క్రిప్ట్ పరంగా కూడా కొరటాల సైడ్ నుంచి ఎప్పుడో క్లారిటీ వచ్చేయడంతో బాలయ్య కూడా సినిమా స్టార్ట్ చేసేయాలని చూస్తున్నారట. సో ఈ మ్యాడ్ కాంబినేషన్ లో ఓ సాలిడ్ అవుటింగ్ రాబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు