ఆర్ ఆర్ ఆర్ హీరోలకు రాజమౌళి లాక్ డౌన్ సూచనలు

ఆర్ ఆర్ ఆర్ హీరోలకు రాజమౌళి లాక్ డౌన్ సూచనలు

Published on May 6, 2020 12:08 AM IST

NTR RamCharan

ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లాక్ డౌన్ కారణంగా ఇంటిలో ఉంటూ తమ తమ కుటుంబాలతో గడుపుతున్నారు. లాక్ డౌన్ ఉపసంహరించిన అనంతరం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి 9న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. కావున మిగిలి సినిమా షూటింగ్ పూర్తి చేసి, చెప్పిన సమయానికి మూవీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఐతే లాక్ డౌన్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోలకు ఫిట్ నెస్ పెద్ద పరీక్షగా మారింది.

ఎన్టీఆర్, చరణ్ ఫిట్ నెస్ కోల్పోతే షూటింగ్ కి ఇబ్బంది ఏర్పడే అవకాశం కలదు. లాక్ డౌన్ వలన ఫిట్ నెస్ నిపుణులు, అందుబాటులో లేని పరిస్థితి. కాబట్టి స్వయంగా ఫుడ్ మరియు వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఫిట్ గా బాడీ మైంటైన్ చేయాలని రాజమౌళి వారికి సూచించారట. కాబట్టి ఇంటిలో ఖాళీగా ఉన్నప్పటికీ ఓ పక్క బరువు పెరగ కుండా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుందట. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్, చరణ్ ముందున్న ఛాలెంజ్ అదే అని తెలుస్తుంది.

తాజా వార్తలు