మళ్ళీ రిలీజ్ కాబోతున్న విజయ్ “బిగిల్”

మళ్ళీ రిలీజ్ కాబోతున్న విజయ్ “బిగిల్”

Published on Jun 19, 2020 1:18 AM IST

Bigil2
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా తన హిట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “బిగిల్”. తెలుగులో “విజిల్” పేరిట గత ఏడాది విడుదల అయ్యి భారీ విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 300 కోట్ల గ్రాస్ ను రాబట్టుకున్న ఈ చిత్రం కోలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు మరోసారి విడుదల అయ్యేందుకు రెడీ అవుతుందట. కానీ మన దగ్గర కాదు. ఈ జూన్ లోనే పలు ఐరోపా దేశాల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ జూన్ 21 న జర్మనీలో అలాగే 22న ఫ్రాన్స్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందట. అక్కడ కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఓ తమిళ్ సినిమా విడుదల కావడం విశేషమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు