గత ఏడాది తెలుగు సినిమా దగ్గర చిన్న సినిమాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించినవి ఉన్నాయి. అలా ఏడాది ఎండింగ్ కి బ్యాంగర్ గా వచ్చిన సర్ప్రైజ్ హిట్స్ లో హారర్ థ్రిల్లర్ హిట్ చిత్రం “ఈషా” కూడా ఒకటి. సాలిడ్ బజ్ ని ప్రమోషన్స్ తో అందుకొని రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లే అందుకుంది.
యువ నటీనటులు అదిత్ అరుణ్, హెబా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ లు నటించిన ఈ చిత్రం లేటెస్ట్ గా ఓటిటిలో రెంటల్ గా ఆల్రెడీ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టు ఇప్పుడు ఖరారు చేశారు. సో ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోజు వరకు ఆగితే సరిపోతుంది. ఇక ఈ చిత్రంలో బబ్లు పృథ్వీ నెగిటివ్ రోల్ లో నటించగా ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. అలాగే కెఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాణం వహించారు.


