కాజల్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె లేటెస్ట్ మూవీ మోసగాళ్ల నుండి ఓ పోస్టర్ విడుదలైంది. మంచు విష్ణు, కాజల్ అర్థ ముఖాలతో ఉండగా వారి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు ఉన్నాయి. సినిమాలో వీరి పాత్రల పేర్లు అర్జున్ మరియు అను అని తెలుస్తుంది. ఆసక్తికరంగా ఉన్న ఆ పోస్టర్ చూస్తుంటే అసలు ఈ అర్జున్, అను కథేంది..అనే సందేహం కలుగుతుంది.
ఇండో-అమెరికన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని సొమ్ములు దోచుకొనే గ్యాంగ్ గురించిన క్రైమ్ డ్రామాగా మోసగాళ్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఓ కీలక రోల్ చేస్తుండగా, నవదీప్, నవీన్ చంద్ర కూడా నటిస్తున్నారు. జెఫరీ గీచిన్ ఈ చిత్రానికి దర్శకుడు.


