2017లో మొదలైన ఆరడుగుల బుల్లెట్ మూవీకి మోక్షం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఆరడుగుల బుల్లెట్ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల విషయంలో వాయిదా పడుతూ వస్తుంది. ఐతే ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉందని టాక్. అంతేకాదు ఇప్పటికే ఓటీటీ వారి నుంచి భారీ ఆఫర్ కూడా వచ్చినట్లుగా చిత్రయూనిట్ వర్గాల నుంచి తెలుస్తుంది. ప్రస్తుతం ఓటీటీ వారితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ మూవీ ప్రముఖ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుందని అంటున్నారు.మరి ఏళ్లుగా ఆగిపోయిన ఆ సినిమా విడుదల అయితే నిర్మాతకు, హీరోకు కొంచెం ఉపశమనం కలిగే అంశం.


