
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు భారీ విజయాల అనంతరం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై మహేష్ ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు పెట్టుకొన్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ షూట్ వచ్చే నవంబర్ లో స్టార్ట్ కానున్న సంగతి కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో పలు గాసిప్స్ వినిపించాయి. బహుశా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అనీల్ కపూర్ విలన్ రోల్ లో కనిపిస్తారని టాక్ వచ్చింది.
అయితే అతడు ఫిక్సే అన్నట్టుగా ఇప్పటికీ పలు కథనాలు ఇంకా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ విషయంలో ఖచ్చితమైన క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

