‘ప్యారడైజ్’ నుంచి ఆయా షేర్.. అనిరుద్ ట్రీట్ ప్రోమోకి టైం ఫిక్స్

‘ప్యారడైజ్’ నుంచి ఆయా షేర్.. అనిరుద్ ట్రీట్ ప్రోమోకి టైం ఫిక్స్

Published on Feb 22, 2026 11:01 PM IST

The-Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ది ప్యారడైజ్”. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ దెబ్బకి నాని టైర్ 1 లోకి వచ్చేస్తాడు అని గట్టి నమ్మకంగా ఉన్నారు. మరి అంతే హైప్ లో ఈ సినిమా కొనసాగుతూ ఉండగా మేకర్స్ ఇటీవల అవైటెడ్ గా ఉన్న ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు.

సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ పై గట్టి అంచనాలు అయితే ఉన్నాయి. ఆయా షేర్ అంటూ అనౌన్స్ చేసిన ఈ సాంగ్ తాలుకా ప్రోమోకి ఇప్పుడు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. రేపు ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ ప్రోమో వదులుతున్నట్టు నానిపై ఓ స్ట్రైకింగ్ పోస్టర్ ని డిజైన్ చేసి వదిలారు.

దీనితో ఫ్యాన్స్ అంతా ఈ ప్రోమో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నానితో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న అనిరుద్ ఈ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగష్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు