‘టాక్సిక్’, ‘ధురంధర్’ లకి ప్రియార్టీ మనమే.. మరి తెలుగు ఆడియెన్స్ కి?

‘టాక్సిక్’, ‘ధురంధర్’ లకి ప్రియార్టీ మనమే.. మరి తెలుగు ఆడియెన్స్ కి?

Published on Feb 23, 2026 12:00 AM IST

Dhurandhar-and-Toxic

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కన్నడ సినిమా నుంచి వస్తున్న చిత్రం టాక్సిక్ అలానే బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ చిత్రం ధురంధర్ 2 కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలూ ఒకే డేట్ లో క్లాష్ గా వస్తుండగా ఈ భారీ క్లాష్ పై మరింత హైప్ నెలకొంది.

మరి ఈ నేపథ్యంలో రెండు సినిమాల బృందాలు పాన్ ఇండియా మార్కెట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఇందులో మరీ ముఖ్యంగా తెలుగు మార్కెట్ ని రెండు సినిమాల మేకర్స్ ప్రియార్టీగా తీసుకుంటున్నారు. ధురంధర్ 2 కి అయితే హిందీ తర్వాత తెలుగు మార్కెట్ నే ముందు రేస్ లో ఉంచుకున్నారు.

అలాగే టాక్సిక్ కూడా కన్నడ తర్వాత హిందీ, తెలుగు మార్కెట్ లనే టార్గెట్ చేస్తున్నారు. సో ఇలా రెండు భారీ సినిమాలు కూడా తెలుగు మార్కెట్ పైనే కన్నేశారు. ప్రస్తుతానికి అయితే రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. సో వారికి ఎలా ఉన్నా మన దగ్గర మాత్రం ఏ సినిమాకి ఎక్కువ మనవాళ్ళు ప్రియార్టీ ఇస్తారో చూడాలి మరి.

తాజా వార్తలు