క్రేజీ కపుల్ నుండి ఇంట్రస్టింగ్ ఫోటో !

క్రేజీ కపుల్ నుండి ఇంట్రస్టింగ్ ఫోటో !

Published on Oct 18, 2020 10:07 PM IST

Virat Kohli anushka Sharma

క్రేజీ కపుల్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ మధ్య అనుబంధం ఎంతో ఘాఢమైనదని ఇప్పటికే అనేకసార్లు రుజువు అయింది. అయినా ఈ జంట ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపర్చడానికి వినూత్నంగా ఆలోచిస్తూ.. తమకు సంబంధించిన కొత్త ఫోటోలను ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ జంట పోస్ట్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఫోటోలో కోహ్లీ అనుష్క ఇద్దరూ నీళ్లల్లో గుండెల గుండెల వరకూ మునిగి ఒకర్ని ఒకరు చాల ఘాడంగా చూసుకుంటూ ఉండటం మొత్తానికి బాగా ఇంట్రస్ట్ గా ఉంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫోటోను ప్రముఖ క్రికెటర్ ఎబి డెవిలియర్స్ తీశారు. ఇక విరాట్‌-అనుష్కల పెళ్లి డిసెంబర్‌ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో వైభవోపేతంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు