నయనతార పెళ్లి పై కొత్త రూమర్ !

నయనతార పెళ్లి పై కొత్త రూమర్ !

Published on Oct 18, 2020 11:01 PM IST

Nayantara

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజానికి వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుండి ఎప్పుడూ ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకసార్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీళ్ళు తమిళ నాడులో ఓ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని కొత్తగా వార్తలు వస్తున్నాయి.

ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేసాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది. అయితే కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారట. కాగా పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయనతార స్పందించే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు