ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమా పరిశ్రమకు ఎంతో తీరని లోటు వాటిల్లింది. హాలీవుడ్ తో పాటుగా మన ఇండియన్ సినిమాలో కూడా ఎందరో వెర్సిటైల్ అండ్ టాలెంటెడ్ నటుల అకాల మరణాలు విస్మయానికి గురి చేసాయి. ఇప్పుడు అలాగే మన దేశానికి చెందిన మరో సీనియర్ అండ్ వెర్సిటైల్ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్ను మూయడం భారతీయ సినీ ప్రపంచానికే తీరని నష్టాన్ని మిగిల్చింది.
బెంగాలీకు చెందిన ఈ నటుడు గత అక్టోబర్ 6న కరోనా మూలాన కోల్ కత్తా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నెగిటివ్ వచ్చినా మళ్ళీ ఆరోగ్యం క్షీణించడంతో మళ్ళీ అనారోగ్యానికి లోనయ్యారు. కానీ వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయేసరికి ఆయన కన్ను మూసారు.
భారతీయ సినిమాలో లెజెండరీ దర్శకుడు సత్య జిత్ రే తో కెరీర్ ఆరంభించి ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి దాదా సాహెబ్ పురస్కారం, పద్మభూషణ్ లాంటి రివార్డుల చేత పురస్కరించబడ్డారు. అలాంటి ఈ నటుని అకాల మరణం భారతీయ సినిమాలో ఒక మహా అధ్యాయానికి ముగింపు పలికినట్టు అయ్యింది.


