బాలయ్య కొట్టడంపై క్లారిటీ ఇచ్చిన కొత్త హీరో

బాలయ్య కొట్టడంపై క్లారిటీ ఇచ్చిన కొత్త హీరో

Published on Nov 18, 2020 9:08 PM IST

bala

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య స్పీచ్, కొన్ని చర్యలు బాగా వైరల్ అయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సమయంలో ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న హర్ష్ బాలయ్య పక్కనే ఉండి పోస్టర్ మీద చేయి పెట్టగా బాలయ్య అతని చేతిని పక్కకు తోశారు. ఆ సీన్ కెమెరా కళ్ళకు చిక్కడంతో అది కాస్త వైరల్ అయింది.

సోషల్ మీడియాలో, యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పెద్ద హడావిడే జరిగింది. సదరు వీడియో మీద మీమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. కానీ ఆ సంఘటన వెనుక కారణం వేరే ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద తాను ఎడమ చేయి పెట్టడంతో అలా ఎడమ చేత్తో రిలీజ్ చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో బాలయ్యగారు తన చేతిని సరదాగా వెనక్కు నెట్టారని, తరవాత కుడి చేతో పట్టుకోమని చెప్పారని, బాలయ్య చాలా మంచి వ్యక్తని, తమను ఆశీర్వదించారని హీరో హర్ష్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రాన్ని వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు నిర్మిస్తుండగా జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు