చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ట్ చేసిన తాజా చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు నెలకొపుకున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అలాగే నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం మరో ఏడాది పరిస్థితుల వల్ల మిస్సవ్వాల్సి వచ్చింది. కరోనా లేనట్టయితే ఈ ఏడాది మే లో ఈ సినిమా విడుదలను మేకర్స్ ప్లాన్ చేసారు.
అప్పటి చాలా మేర షూటింగ్ అయ్యిపోవడంతో పవన్ అభిమానులు కూడా ఎదురు చూసారు కానీ ఊహించని విధంగా కరోనా బ్రేక్ వెయ్యడంతో చాలా దూరం ఈ చిత్రం వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మిగతా షూట్ కూడా అయ్యిపోతుండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ సినీ వర్గాల్లో మొదలయ్యింది. ఈ చిత్రాన్ని ముందుగా చెప్పినట్టుగానే వేసవి రేస్ లోనే విడుదల చేయనున్నారట.
ఏప్రిల్ నెల రెండో వారంలో ఈ సినిమాకు ఒక డేట్ ను మేకర్స్ అనుకుంటున్నట్టుగా ఇప్పుడు టాక్. మరి పవన్ అభిమానులు ఎప్పటి నుంచు ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నిజంగానే అప్పుడు విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


