తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్కు సమయం ఆసన్నమైందని.. ఈ సినిమాకు సంబంధించిన వరుస బిగ్ అప్డేట్స్ను రేపటి(సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రేపటి నుంచి రాబోయే వరుస ప్రమోషనల్ అప్డేట్స్తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
The hunt is about to begin! 🔥#Jailer2 Updates From Tomorrow 😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss… pic.twitter.com/qigGGO7cNZ
— Sun Pictures (@sunpictures) September 17, 2026


