పవన్ క్రేజీ మల్టీస్టారర్ అప్పటికే పూర్తి చేసేస్తారా?

పవన్ క్రేజీ మల్టీస్టారర్ అప్పటికే పూర్తి చేసేస్తారా?

Published on Dec 22, 2020 9:20 AM IST

pawan 7

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ పై నిన్న పూజా కార్యక్రమం అలాగే రానాకు కూడా చిత్ర యూనిట్ వెల్కమ్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ రచ్చ నడించింది. అయితే సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

దసరా సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ జనవరి నుంచే షూట్ మొదలు పెట్టుకోనుంది. అయితే ఈ చిత్రంను ఎప్పటికి ఫినిష్ చేసేస్తారు అన్నది కూడా టాక్ వినిపిస్తుంది. జనవరిలో మొదలు పెట్టే ఈ చిత్రాన్ని పూరేతి చేసుందుకు పెద్దగా సమయాన్ని తీసుకోరట.

దాదాపు రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసేస్తారని వినికిడి. మరి విడుదలను ఎప్పటికి ప్లాన్ చేస్తారో అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే దీనికి ముందే పవన్ రెండు సినిమాలను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు