ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ప్రస్తుతం అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు తో షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మొదటి నుంచీ సస్పెన్స్ గా నిలిచిన ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది అంటే అది విలన్ కోసమే అని చెప్పాలి. ఈ రోల్ పై చాలా కాలం పాటే మంచి సస్పెన్స్ కొనసాగింది.
కానీ ఇప్పటికీ కూడా ఎవరి పేరూ కూడా ఫైనలైజ్ కాలేదని సమాచారం. కానీ టాక్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రోల్ కు ఒక ఊహించని పేరే వినిపిస్తుంది. కమెడియన్ నుంచి హీరోగా మారి ఇప్పుడు సాలిడ్ విలన్ రోల్స్ చేస్తున్న సునీల్ పేరు అండర్ లోకి వచ్చిందట. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


