
ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాపై మన దక్షిణాదిలోనే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. అలాగే తమిళ్, తెలుగు భాషలతో పాటు మొత్తం పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్ రెడీ చేసారు.
అయితే అంతకు ముందే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఇంకా సెన్సేషనల్ రికార్డులను నెలకొల్పుతూ వస్తుంది. అలా తాజాగా ఈ టీజర్ మన దక్షిణాదిలోనే రెండో 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న టీజర్ గా నిలిచి మరో రికార్డు అందుకుంది.దీనికి ముందు కూడా విజయ్ నటించిన బిగిల్ టీజర్ కూడా 50 మిలియన్ అందుకొని రెండు 50 మిలియన్ వ్యూస్ కు పైగా టీజర్ లు ఉన్న హీరోగా విజయ్ దక్షిణాదిలోనే రికార్డు సెట్ చేసాడు.
ఇప్పుడు ఇది మరో రికార్డు. మొత్తానికి మాత్రం విడుదలకు ముందు విజయ్ సినిమా దుమ్ము లేపేస్తుంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో విజయ్ గత చిత్రం “విజిల్”ను విడుదల చేసిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారే విడుదల చేస్తున్నారు.

