‘ఇట్లు అర్జున’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

‘ఇట్లు అర్జున’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Published on Sep 18, 2026 2:00 AM IST

యంగ్ హీరో అనీష్, అందాల భామ అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు అర్జున’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒకింత బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి రాబోతున్న టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు