బాలయ్య బాబు ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు. తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే ఆ ఆమధ్య బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. మరోపక్క బి గోపాల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు. ‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రాస్తున్నారట.
అదేవిధంగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య’ కలయికలో కూడా ఓ సినిమా రానుంది. ప్రస్తుతం పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. ఇక ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి బాలయ్య లిస్టులో ఇప్పుడు మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి.


