“వకీల్ సాబ్” టీజర్ యుఫోరియా బిగిన్ అయ్యిపోయింది.!

“వకీల్ సాబ్” టీజర్ యుఫోరియా బిగిన్ అయ్యిపోయింది.!

Published on Jan 5, 2021 8:00 AM IST

vakeel saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అతని అభిమానులు ఇస్తే సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే మేకర్స్ టీజర్ కోసం ప్రకటించేసారు.

దీనితో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ తో గట్టి రికార్డులే కొట్టాలని ఫిక్స్ అయ్యిపోయారు. మరి అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా రచ్చ మొదలు పెట్టేసారు. అలాగే “అజ్ఞ్యాతవాసి” తర్వాత ఇన్నాళ్లకు రాబోతున్న టీజర్ కావడంతో “వకీల్ సాబ్” టీజర్ కు 24 గంటల్లోనే సెన్సేషనల్ రికార్డులు నెలకొల్పాలని చూస్తున్నారు.

ఇప్పటికే ట్విట్టర్ లో ఆ సందడి మొదలయ్యిపోయింది. మరి పవన్ ఫ్యాన్స్ ఈ టీజర్ తో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేతా థామస్, అంజలీలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు