
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే సినిమా షూటింగ్ ముగిసింది. దీంతో టీమ్ కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా టీజర్ రెడీ చేశారు.
ఈ టీజర్ జనవరి 14వ తేదీన 6:03 గంటలకు విడుదల కానుంది. మొదట ఈ సంక్రాంతికి సినిమా ఉంటుందని అన్నారు. అభిమానులైతే పండుగను పవన్ సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమాను పూర్తిచేయడానికి తగిన సమయం లేకపోవడం, థియేటర్లు సగం ఆక్యుపెన్సీతోనే నడుస్తుండటంతో విడుదల వెనక్కు వెళ్ళింది. ఇండస్ట్రీ వర్గాల టాక్ మేరకు ఈ నెలాఖరుకు విడుదల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో.. ఈ సంక్రాంతికి అభిమానులు టీజర్ తోనే సరిపెట్టుకోవాలి మరి. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

