లేటెస్ట్..’వారణాసి’ షూట్ అప్పటికి ముగియనుందా!

లేటెస్ట్..’వారణాసి’ షూట్ అప్పటికి ముగియనుందా!

Published on Sep 19, 2026 12:01 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి కోసం అందరికీ తెలిసిందే. పూర్తిగా ఐమాక్స్ వెర్షన్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. మేకర్స్ మొదటి నుంచీ సినిమా షూట్ అంతా ఈ ఏడాది అక్టోబర్ కే పూర్తవుతుంది అని చెబుతూ వచ్చారు.

అయితే అక్టోబర్ పూర్తిగా కూడా అక్కర్లేదు అక్టోబర్ మొదటి వారనికే ప్యాకప్ చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక అక్కడ నున్సీ అంతా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులే అని చెప్పాలి. రాజమౌళి కెరీర్ లో అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఇదీ ఒకటి అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే రానున్న ఏప్రిల్ 7న సినిమా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు