
ఇప్పుడు మన దేశంలో ఉన్న పలు మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు టీజర్ తర్వాత మరో లెవెల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా ఓ వార్త వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం యష్ అభిమానులు ఏకంగా దేశ ప్రధానికే ఓ లేఖ రాసారని సోషల్ మీడియాలో రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ చిట్టి స్టోరీ ఏమిటంటే ఈ భారీ చిత్రం విడుదల అవుతున్న కారణంగా ఆ రోజు జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నారు. అంటే ఆ రేంజ్ లో దేశ వ్యాప్తంగా సినిమా సెన్సేషన్ ను నమోదు చేస్తుందని వారు చెప్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో కానీ వీరు రాసిన లేఖ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతుంది.

