కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, నయనతార అలాగే రుక్మిణి వసంత్ ఇంకా బాలీవుడ్ హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “టాక్సిక్”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమా విడుదలకి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
తబాహి అంటూ సాగే ఈ సాంగ్ ని మేకర్స్ ఈ మార్చ్ 2న వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై వదిలిన హాట్ పోస్టర్ కూడా వదిలారు. ఇందులో షర్ట్ లెస్ గా యష్ కనిపిస్తుంటే హీరోయిన్ కియారా తన బిగి కౌగిలిలో కనిపిస్తుంది. దీనితో ఈ క్రేజీ పోస్టర్ ని అభిమానులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ మార్చ్ 19న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.
A Toxic world, a safe embrace.#Tabaahi
Song out on 2nd March.#ToxicTheMovie@TheNameIsYash#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/s5LCVRvp33
— TOXIC (@Toxic_themovie) February 27, 2026


