‘ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’ బార‌సాల వేడుక‌..!

‘ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’ బార‌సాల వేడుక‌..!

Published on Feb 3, 2021 7:49 PM IST

FCUK 1

సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి జంటగా, బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌లో విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపిద్దుకున్న ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు. అయితే ఈ నెల 6 వ తేది శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జరుపుకుంటుంది. ఈ విష‌యం తెలియ‌జేస్తూ చిత్ర బృందం తాజాగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. అయితే అసలు బార‌సాల వేడుక ఏమిటి అని అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం వ్యక్తం అయ్యింది. ఆ త‌ర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఇలా పేరు పెట్టిన‌ట్లు అర్థం చేసుకొన్నారు. అయితే అదే రోజు ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ ఆసక్తిని పెంచడమే కాకుండా సినిమాపై మరింత అంచ‌నాల‌ను పెంచేసింది.

అయితే రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ పాత్రలో ఆయన కనబరించిన నటన ప్రేక్ష‌కులను మరింత అల‌రించ‌నున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయ‌న చాలా కాలం త‌ర్వాత ఇలాంటి పాత్ర‌ను పోషించ‌డం విశేషం.

ఇక ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సుమ‌ధుర సంగీత బాణీలు అందించిన పాట‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బంది లాంటి కోవిడ్ హీరోల చేతుల మీదుగా విడుద‌లై సంగీత ప్రియుల ఆద‌రాభిమానాల‌ను పొందుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌లు కూడా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు