
సుప్రీం హీరో సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సాయి తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు. వచ్చేవారం నుండి మరో సినిమా సెట్ మీదకు వెళ్లబోతునట్లు తెలుస్తోంది. మరో కొత్త దర్శకుడి కథను ఓకే చేసి.. ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో కృష్ణవంశీ దగ్గర పనిచేసిన విజయ్ అనే డైరెక్టర్ తో సాయి తేజ్ ఈ సినిమా చేస్తున్నాడట.
ఇక తేజు ప్రస్తుతం ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయనున్నాడు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ మధ్యన వరుస ప్లాపులతో కాస్త ఇబ్బంది పడినా… మళ్లీ వరుస హిట్స్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అభిమానులకి దగ్గరకు ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

