ఎన్టీఆర్ తో మరో స్టార్ డైరెక్టర్ ?

ఎన్టీఆర్ తో మరో స్టార్ డైరెక్టర్ ?

Published on Feb 8, 2021 6:00 PM IST

NTR Prashanth

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తన తరువాత సినిమాలను చాలా ప్లాన్డ్ గా ఫిక్స్ చేసుకుంటున్నాడు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పై తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా బాగా ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. ఆ తరువాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేసే అలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సంజయ్ లీలా భన్సాలీతో కూడా తారక్ ఒక సినిమాని కమిట్ అయ్యాడని తెలుస్తోంది. ఏమైనా తారక్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు